బ్రేకింగ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వాయిదా…?

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వాయదా పడే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానం వస్తుంది. న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే అమెరికా ఎన్నికల ఫలితాలు రావడానికి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తున్నారు అని డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఫలితాల విషయంలో తాము సుప్రీం కోర్ట్ కి వెళ్తామని ఆయన అన్నారు.

అటు న్యాయ పోరాటానికి జో బిడెన్ కూడా రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అందుతున్న లెక్కల్లో జో బిడెన్ దూకుడుగా ఉన్నారు. జో బిడెన్ కచ్చితంగా విజయం సాధిస్తారని సర్వే ఫలితాలు కూడా చెప్తున్నాయి. ఒకవేళ ఎన్నికల కౌంటింగ్ నిలిపివేస్తే మాత్రం పరిణామాలు మారే అవకాశం ఉందని అంటున్నారు. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఓట్లను కౌంటింగ్ లో కలిపారు అని ట్రంప్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version