ఫౌ-జి గేమ్ కు పెరుగుతున్న నెగెటివ్ రేటింగ్స్.. గేమ్ న‌చ్చ‌లేదా ?

-

ఎన్ కోర్ గేమ్స్ సంస్థ ఇటీవ‌లే ఫౌ-జి గేమ్‌ను లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఈ గేమ్‌ను లాంచ్ చేశారు. అయితే ఈ గేమ్‌ను యూజ‌ర్లు పెద్ద సంఖ్య‌లో డౌన్‌లోడ్ చేసుకున్న‌ప్ప‌టికీ గేమ్‌కు పాజిటివ్ రివ్యూలు మాత్రం రావ‌డం లేదు. యూజ‌ర్లు పెద్ద ఎత్తున నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

users are giving negative ratings to fau-g game

ఫౌ-జి గేమ్ ప్ర‌స్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్ర‌మే ల‌భిస్తోంది. అయితే ఈ గేమ్‌కు అంత హైప్ వ‌చ్చినా గేమ్ ఏమీ బాగా లేద‌ని యూజ‌ర్లు రివ్యూలు పెడుతున్నారు. అలాగే గేమ్‌కు త‌క్కువ రేటింగ్ ఇస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఈ గేమ్ రేటింగ్ ప్లే స్టోర్‌లో 3.5 వ‌ద్ద కొన‌సాగుతోంది. మొద‌ట్లో ఈ గేమ్‌కు 4.0 వ‌ర‌కు రేటింగ్ ఉండేది. కానీ వారం రోజుల్లోనే రేటింగ్ భారీగా త‌గ్గ‌డం విశేషం.

గేమ్‌లో అనేక స‌దుపాయాల‌ను ఇంకా మెరుగు ప‌ర‌చాల్సి ఉంద‌ని, ప్ర‌స్తుతం గేమ్‌లో గ‌న్స్ ద్వారా ఫైటింగ్ అందుబాటులో లేద‌ని, అయిన‌ప్ప‌టికీ చేతుల్తో ఫైటింగ్ చేసినా కంట్రోలింగ్ ఇబ్బందిగా ఉంద‌ని యూజ‌ర్లు కామెంట్లు పెడుతున్నారు. గేమ్‌ను ఇంకా మెరుగు ప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని అంటున్నారు. అయితే గేమ్ డెవ‌ల‌ప‌ర్లు మాత్రం గేమ్‌ను ఇంకా మెరుగు ప‌రిచి అందిస్తామ‌ని ఇంత‌కు ముందే చెప్పారు. క‌నుక గేమ్‌ను వారు ఇంకా ఏవిధంగా మారుస్తారు, రేటింగ్స్ భ‌విష్యత్తులో ఏమైనా మెరుగు ప‌డ‌తాయా ? అన్న వివ‌రాలు వేచి చూస్తే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news