లూఫా వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ సమస్యలు రావటం కాయం..!

-

రోజువారి స్నానంలో లూఫా( బాడీ వాషర్) వాడటం చాలామందికి అలవాటు అయిపోయింది. దానికి అలవాటు పడిన వాళ్లు లూఫా లేకుండా స్నానం చేస్తే అసలు ఫ్రష్ ఫీలింగ్ ఉండదు. మృతకణాల్ని, పొడిబారిపోయి పొలుసులుగా మారిన చర్మాన్ని తొలగించుకొని మంచి మృదుత్వానని సొంతం చేసుకోవడానికి లూఫా చక్కగా పనికొస్తుంది. అయితే ఈ బాడీవాషర్ శుభ్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైనా జాగ్రత్తలు తీసుకోకపోతే..చర్మసమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.

2 నెలలు చాలు.

లూఫాతో ఒళ్లు రుద్దుకోవడం, పని పూర్తయ్యాక దాన్ని బాత్‌రూమ్‌లోనే పైపైన శుభ్రం చేసి అక్కడే హ్యాంగర్‌కు తగిలించడం మనలో చాలామంది చేసే పని. నిజానికి అలా చేయటం మంచిది కాదు..అప్పటికే తడిగా ఉన్న లూఫాను చుట్టూ తేమగా ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల దానిపై బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉందటున్నారు సౌందర్య నిపుణులు. ఈ క్రమంలో మొటిమలు, ఇతర సౌందర్య సమస్యలకు ఇదే మూలకారణం కావచ్చని చెబుతున్నారు.

అందుకే దాన్ని వాడిన వెంటనే శుభ్రపరిచి.. ఎండలో ఉంచడం మంచిది. అలాగని ఒకే లూఫాను నెలల తరబడి వాడినా ఇలాంటి సమస్యలు తప్పవు.. కాబట్టి ఎనిమిది వారాల తర్వాత లూఫాను మార్చడం తప్పనిసరి..ఒకవేళ ఈ మధ్యలోనే లూఫా నుంచి దుర్వాసన రావడం, రంగు మారడం.. వంటివి గమనిస్తే వెనువెంటనే దాన్ని మార్చేయడం ఉత్తమం. వీళ్లు ఇలాగే చెప్తారు..వెంటనే మార్చడం ఏంటి అనుకుంటున్నారేమో..రెండు నెలలు అనేది ప్రామాణికం..కనీసం మీరు దీన్ని బట్టి 5నెలలకైనా దాన్ని పడేసి కొత్తది తీసుకోవటం ఉత్తమం.

ఏ లూఫా ఎలా శుభ్రపరచాలి?

లూఫాను శుభ్రం చేయడానికీ కూడా ఓ పద్ధతుందట. ఈ క్రమంలో కొన్ని ప్రత్యేక ద్రావణాలను ఉపయోగించచ్చు

వాడిన లూఫాపై బ్యాక్టీరియా, ఇతర క్రిములు వృద్ధి చెందకుండా ఉండేందుకు బ్లీచ్‌ కలిపిన నీటిలో వేసి పది నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగి ఎండలో ఆరబెట్టాలి

గోరువెచ్చటి నీటిలో ఏదైనా నూనె వేసి ఆ నీటితోనూ లూఫాను శుభ్రపరచచ్చు.

ఒకవేళ వాషింగ్‌ మెషీన్‌లో దీన్ని వేయాలనుకునే వారు.. డ్రై చేయకముందే దీన్ని తొలగించాలి. ఎందుకంటే డ్రై చేసే క్రమంలో వెలువడే వేడి కారణంగా ఇందులోని సహజసిద్ధమైన ఫైబర్లు కరిగిపోయే అవకాశాలెక్కువట.

ఇక సింథటిక్‌ లూఫాలను అవెన్‌లో పెట్టి రెండు నిమిషాల పాటు వేడి చేసినా సరిపోతుంది. అయితే వీటిలో ప్లాస్టిక్‌/లోహాలతో తయారుచేసిన భాగాలు లేకుండా చూసుకోండి.

ఇలా ఏ లూఫాలనైనా వారానికి ఒకటి లేదా రెండుసార్లు శుభ్రపరిస్తే దానివల్ల దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

వీళ్లు వాడొద్దు..

మనం క్రీమ్, లోషన్స్ ఎలా అయితే మన చర్మానికి తగ్గట్టు ఎంచుకుంటామో.. లూఫా విషయంలోనూ ఇది వర్తిస్తుంది. అయితే అది ఎంత మృదువుగా ఉన్నప్పటికీ సున్నితమైన చర్మతత్వం ఉన్న వారు లూఫా వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల చర్మం ఎరుపెక్కడం, దద్దుర్లు, వాపు రావడం.. వంటి సమస్యలొస్తాయి. చర్మం పొడిబారడం, పొలుసులుగా మారడం కూడా జరగవచ్చు. కాబట్టి సున్నిత చర్మం గల వారు లూఫాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ వాడాలనిపిస్తే.. తరచూ కాకుండా వారానికోసారి లేదంటే నిపుణుల సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో వాడడం ఉత్తమం. లూఫాను ఫేస్ మీద వాడకపోవటం బెటర్. కొంతమంది ఫేస్ మీద కూడా రుద్దేస్తుంటారు. ఫేస్ స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది. దానిపై లూఫా వేసి రుద్దేస్తే..చర్మంమీద రాషెస్ వస్తాయి. ఒకవేళ రుద్దాలనుకుంటే..చాలా సాఫ్ట్ గా రుద్దుకోవాలి.

ఇది మ్యాటర్..మీకు కూడా లూఫా వాడే అలవాటు ఉంటే..దాన్ని ఎలా శుభ్రంచేస్తున్నారో..ఎక్కడ పెడుతున్నారో, ఎన్ని వారాలు వాడుతున్నారు అనే విషయాలు తెలుసుకున్నారు..కచ్చితంగా మీరు ఒక లూఫాను రెండు నెలలు మాత్రమే వాడరు..కాబట్టి ఇప్పటినుంచి వాటిని వీలైనంత తక్కవ రోజులు వాడేందుకు ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version