వామన్‌రావు దంపతుల హత్యకు పోలీసులే కారణం: ఉత్తమ్‌ ఆరోపణ

-

పోలీసులు నిర్లక్ష్యంతోనే హైకోర్టు న్యాయవాదుల దంపతుల హత్యకు గురయ్యారని, ఇందుకు కారణం పోలీసులేనని పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండం గుంజపడుగులోని వామన్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వామన్‌రావు దంపతుల హత్యకేసుపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంథనిలో ఇసుక మాఫియాను ఎవరెవరు నడుపుతున్నారో అందరికీ తెలుసని.. దాని విలువ దాదాపుగా రూ. 15వేల కోట్టు ఉంటుందని అందులో ఎవరెవరికీ ఎంత వాటా వస్తున్నాయే త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయన్నారు.

పోలీసులు బెదిరించారు..

శీలం రంగయ్య లాకప్‌డెత్, ఇసుక మాఫియాలపై కోర్టులో కేసులు వేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు వామన్‌ రావు దంపతులను బెదిరించారన్నారు. ఈ విషయమై ఆ దంపతులు రక్షణ కల్పించాలని కోర్టును కోరగా అందుకు అంగీకరించిన కోర్టు వీరికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించడంతోనే వామన్‌రావు దంపతులు హత్యకు గురయ్యారని ఉత్తమ్‌ ఆరోపించారు.

న్యాయవాదులు ఏకం కావాలి..

న్యాయవాదుల హత్యకేసులో రాష్ట్రంలోని న్యాయవాదులంతా ఏకమై పోరాటం చేయాలని, పార్లమెంట్‌లో న్యాయవాదుల రక్షణ కోసం పోరాటం చేస్తానని ఈ సందర్భంగా ఉత్తమ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో నడిరోడ్డుపై అతిదారణంగా ఓ న్యాయవాద దంపతులను హత్య చేసినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శం అన్నారు. వామన్‌రావు కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం సాగిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version