రైతుల ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ పంట కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పంట కొనుగోలుపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదన్నారు. సూర్యాపేట మార్కెట్ లో రైతులకు మద్దతు ధర లభించడం లేదని అన్నారు. ప్రభుత్వ తీరు మారకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరుగకపోతే వారి తరుపున ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చిరించారు. వరి పంట వేయద్దనడానికి మీరెవరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రబీ పంట సమయంలో వరిపై ఆంక్షలు పెట్టొద్దని ప్రభుత్వానికి సూచించారు. రైతులు ఇష్టమైన పంట వేసుకునే స్వేచ్ఛ కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానన్నారు. తెలంగాణలో ప్రతీ గింజను కొంటామన్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి. పోడు భూముల విషయంలో గిరిజనులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు.