కేసీఆర్ కి అంత భయం దేనికి..?

-

మంజీరా నీటి పారుదల ప్రాజెక్టు వద్ద పరిస్థితిని అంచనా వేసేందుకు వెళుతుండగా పోలీసులు తనను అరెస్ట్ చేశారని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రైతులు, పారిశ్రామిక కార్మికుల కడగండ్లను మరింత పెంచుతూ మంజీరా ప్రాజెక్టులో నీటిమట్టం అడుగంటుతోందని, ఈ నేపథ్యంలో తాను ప్రాజెక్టు వద్దకు వెళుతుంటే అడ్డుకున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు ఎందుకంత భయమో అర్థం కావడంలేదని, తనను మూడ్రోజుల వ్యవధిలో రెండుసార్లు అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version