పొన్నం ప్రభాకర్ ఓ బ్లాక్ మెయిలర్… తప్పుగా మాట్లాడితే చెప్పుతో కొడతా – ఉత్తమ్ వార్నింగ్

-

కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఎన్నికపై నిర్వహించిన సమీక్ష చాలా వాడీ వేడిగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒకరి పై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఓటమికి మీదంటే, మీదే బాధ్యత అని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు టిపిసిసి నేతలు. రేవంత్… ఉత్తమ్ వర్గం గా నేతలు చిలిపోయారు. పొన్నం ప్రభాకర్… ఉత్తమ్ కుమార్ రెడ్డి ల మద్య మాటల యుద్ధం సాగుతోంది. కొందరు టిఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా పని చేశారన్న పొన్నం వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

బ్లడీ ఫూల్ అని పొన్నం పై ఉత్తమ్ ఫైర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ బ్లాక్ మెయిలర్ అని.. తప్పు గా మాట్లాడితే చెప్పుతో కొడతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని ఉత్తమ్ వార్నింగ్ ఇచ్చారు. పెద్ద పెద్ద మీటింగులు పెట్టీ ఏం సాధించారు.. ? అని ఉత్తమ్ నిలదీశారు. వెంకట్ కి టికెట్ ఇవ్వడం తప్పన్నారు. ఇక అంతకు ముందు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం ఫైర్ అయ్యారు. ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ వెనకబడటం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version