తొలి కాబినెట్ సమావేశంలోనే సీఎం యోగీ కీలక నిర్ణయం…. 15 కోట్ల మందికి లబ్ధి

-

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపుగా మూడు దశాబ్ధాల తరువాత ఓ పార్టీ వరసగా రెండో సారి అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. యోగీ సారథ్యంలో బీజేపీ పార్టీ ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో 273 స్థానాలను బీజేపీ కూటమి దక్కించుకుంది. ఇటీవల యోగీ ఆధిత్యనాథ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు ఎన్డీయే ముఖ్యమంత్రులు హజరయ్యారు. 52 మంది మంత్రులు యోగీ క్యాబినెట్ లో కొలువుతీరారు.

ఇదిలా ఉంటే ఈరోజు లక్నోలోని లోక్ భవన్ లో తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.  రాష్ట్రంలో మరో మూడు నెలల పాటు ఉచితంగా రేషన్ ఇవ్వాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల యూపీలోని 15 కోట్ల మంది జనాభాకు లబ్ధి చేకూరనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version