కొత్త జిల్లాల ఏర్పాటు పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమ్మర్ శర్మ, ప్రణాళికా విభాగం కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తదితర అధికారులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు. ఇప్పటి వరకు తొమ్మిది వేలకు పైగా ప్రజలు అలాగే ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల లో ఇప్పటికే కొన్ని పరిష్కరించామని సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏపీ ఉద్యోగులు వివరించారు.
పేరు, రెవెన్యూ డివిజన్లను మార్చాలని కోరుతూ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలపై సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లు సమాచారం అందుతోంది. మరోవైపు జిల్లాల విభజనకు సంబంధించి క్షేత్రస్థాయిలో చేసిన మార్పులు పైన సి ఎస్… జగన్మోహన్ రెడ్డికి వివరించినట్లు సమాచారం అందుతోంది. దాదాపు గంటన్నర పాటు ముఖ్యమంత్రి దీనిపై సమీక్ష నిర్వహించారు. ఈ లెక్కన మార్చి 31వ తేదీన కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం..