కరోనాతో ఉత్తర్‌ప్రదేశ్ కేబినెట్ మంత్రి కమలా రాణి వరుణ్ ప్రాణాలు విడిచారు. ఆమె వయసు 62 సంవత్సరాలు. కమాలాకు కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు సీఎం యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. సహచర మంత్రి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు యోగి. మంత్రి మరణంతో రామ మందిర ఫౌండేషన్ వేడుక సన్నాహాలను సమీక్షించడానికి వెళ్లనున్న సీఎం.. అయోధ్య పర్యటను రద్దు చేసుకున్నారు. కాగా, ఆమె మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. అట్టడుగు ప్రజలకు సేవ చేసి ఎన్నో మన్నలను పొందారన్నారు.
లోక్‌సభలో రెండుసార్లు ఎంపీగా కూడా పనిచేశారన్నారు. ఆమె కుటుంబానికి, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే కమలా రాణికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో జులై 18న ఎస్జీపీజీఐలో చేరారు.. ఆమెకు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. ఆమెకు హైపోటెన్షన్‌తోపాటు అవయవాలు పనిచేయకపోవడంతో ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది.. ఆదివారం ఉదయం మరింత విషమించి కన్నుమూశారు అని ఎస్జీపీజీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే ధిమాన్ అన్నారు.