ఉత్తరాఖండ్‌లో ఇక రెండు రాజధానులు ఏర్పాటు అయ్యాయి. అత్యంత వెనుకబడిన, పర్వత పంక్తులతో కూడిన గైర్‌సైన్ పట్టణాన్ని వేసవి రాజధానిగా అక్కడి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీరాణి మౌర్య సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఉత్తరాఖండ్ తొలి వేసవి రాజధానిగా గైర్‌సైన్ చరిత్ర లిఖించింది. అయితే ప్రస్తుత రాజధాని డెహ్రాడూన్‌కు అదనంగా గైర్‌సైన్ కొనసాగుతుంది.