కర్నూలు లోని ఓర్వకల్ విమానాశ్రయానికి ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. 1008ఎకరాల స్థలంలో 153కోట్ల రూపాయలతో విమానాశ్రయాన్ని నిర్మించామని తెలిపారు. గత ప్రభుత్వం కేవలం రిబ్బర్ కట్ చేయించి, ప్రజలను అనవసర మాటలు చెప్పారని, మేము అధికారంలోకి వచ్చాక కేవలం 18నెలల్లోనే పనులు పూర్తి చేసామని అన్నారు. ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నామని ప్రకటించారు.
గాంధీ, వల్లభా భాయ్ పటేల్ ల కంటే ముందుగానే బ్రిటీష్ వారికి ఎదురు తిరిగి, ప్రజల తరపున పోరాడిన వీరుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పేరును పెడితేనే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ విమానాశ్రయం మార్చి 28వ తేదీ నుండి మొదలవనుంది. ఇండిగో ఎయిర్ లైన్ ఇక్కడ నుండి బెంగళూరుకి ఎగరనుంది. చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు వాయు సేవలు ప్రారంభం అవుతున్నాయి.