రేవంత్ రెడ్డి మీద వీ. హనుమంత రావు సంచలన కామెంట్స్

-

రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివి. నిన్ను కలవాలంటే నీ దగ్గరకు వాళ్ళు రావాలి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆహ్వానించడం కరెక్ట్ కాదు నీ స్థాయి నువ్వే తగ్గించుకుంటున్నావు అని వీ. హనుమంత రావు సంచలన కామెంట్స్ చేసారు. రేవంత్ రెడ్డిని నేను కలిసి చెపుతామంటే టైమ్ ఇస్తలేడు. తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి ఒక్కడే.

Revanth to Yadadri temple today

పార్టీ ని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారు అని వీ. హనుమంత రావు అన్నారు. బీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ గెలుపించారు. కాంగ్రెస్ క్యాడర్ కు న్యాయం చేయకుండా మన కార్యకర్తల పై కేసులు పెట్టినవాళ్లకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అక్రమంగా డబ్బు సంపాదించి ఇప్పుడు అధికారంలో ఉన్నామని కాంగ్రెస్ లోకి వస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క సైడ్ వినకు. రెండు సైడ్స్ వినాలని కోరుతున్నా అని అన్నారు. పార్టీ కార్యకర్తలలకు అన్యాయo చేయకండి. నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు ఎవ్వరికి అన్యాయం జరగొద్దనేది నా ఆవేదన అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version