ప్ర‌పంచానికి చైనా షాక్‌.. ర‌హ‌స్యంగా క‌రోనా టీకా

-

క‌రోనా వైర‌స్‌కు పుట్టినిల్లు అయిన చైనా ప్ర‌పంచానికి ఊహించ‌ని షాక్ ఇచ్చింది. చైనాలో జూలై నుంచే ప్రయోగాత్మకంగా ర‌హ‌స్య టీకాను వినియోగిస్తున్న‌ట్లు తాజాగా వెల్లడైంది. అయితే.. ఆ దేశప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నవారికి, కరోనా చికిత్స అందిస్తున్న వైద్యసిబ్బందికి సైనోవాక్‌ కంపెనీ తయారు చేస్తున్న ‘కరోనావాక్‌’ టీకాను ఇవ్వడానికి చైనా జూలైలోనే ఆమోదం తెలిపిందట‌. ఈ మేరకు ఆ టీకాను ఇస్తునట్టు అంత‌ర్జాతీయంగా వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే.. చైనాలో పరీక్షలదశలో ఉన్న మూడు టీకాల్లో క‌రోనావాక్ టీకా ఒక‌టి కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. చైనా నేషనల్‌ బయోటెక్‌ గ్రూప్‌ కూడా ఇది నిజమేనని పేర్కొంది. ఆ టీకా ప్ర‌యోగం స‌క్సెస్ అయితే.. అంత‌ర్జాతీయంగా టీకా బిజినెస్‌లో కూడా చైనా ముందంజ‌లో ఉంటూ.. ప్ర‌పంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news