మరి కొద్ది వారాల్లో భారత్‌లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాని మోడీ ప్రకటించారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యం ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు ఉంటుందని ముందుగా వారికే అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ఇక కొవిడ్ పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో మరి కొన్ని వారాల్లోనే టీకా వస్తుందని శుభవార్త చెప్పారు ప్రధాని మోదీ. టీకా ధరపై రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోడీ తెలిపారు.
అఖిల పక్ష సమావేశం లో కరోనా పరిస్థితి, వ్యాక్సిన్ పురోగతి, టీకా పంపిణీ తదితర అంశాలను అఖిల నేతలకు ప్రధాని మోడీ వివరించారు.ఇక కాగా తమ వ్యాక్సిన్ 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ఫైజర్ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యూకే లో ఆమోదం పొందటంతో అక్కడ వ్యాక్సిన్ ను అత్యవసరంగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఫైజర్ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వ్యాక్సిన్ ని భారత్ లో కూడా తెచ్చే అవకాశం కనిపిస్తోంది.