కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ మనదేశంలోనూ విలయం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి కరోనా వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ తారలకు ఈ వైరస్ సోకింది. ఇందులో కొంత మంది కొలుకోగా.. మరి కొందరు కరోనాకు బలి అయ్యారు. ఇక కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో అన్నీ రాష్ట్రాలు వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. అయితే మొదట్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి.. ప్రజలు ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. వ్యాక్సిన్ వేయించుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ విషాదం చోటు చేసుకుంది. మనదేశంలో వ్యాక్సిన్ వికటించి.. తొలి మరణం సంభవించింది.
ఈ మేరకు అధికారికంగా కేంద్రం ధృవీకరించింది. మార్చి 8న తొలిడోసు తీసుకున్న 68 ఏళ్ల వృద్ధుడు… డోసు తీసుకోవడం వలన వచ్చిన రియాక్షన్‌తో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఆ వృద్ధుడు ఏ టీకా వేసుకున్నాడో వివరాలు తెలియరాలేదు. కాగా ఇండియాలో కొత్తగా 60,471 కరోనా కేసులు, 2726 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా 2,95,70,881 కరోనా కేసులు,3,77,031 మరణాలు నమోదు కాగా… ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 9,13,378కు చేరింది.