మూడేళ్ళుగా పవన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తెర మీద చూడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ముందుగా చేసిన వకీల్ సాబ్ విడుదల దగ్గర పడింది. బాలీవుడ్ పింక్ సినిమా తెలుగులో వకీల్ సాబ్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్ భారీ సంచలనాలు కూడా క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ మానియా ఎంతలా ఉందో ఈ విషయం ద్వారా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక ఈరోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్ప కళా వేదికలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. కరోనా దృష్ట్యా చాలా తక్కువ మందిని అనుమతిస్తున్నారు. అయితే పాసులు పొందిన అభిమానులు ఇప్పటికే అక్కడికి చేరుకొని రచ్చ మొదలు పెట్టేశారు.