న్యాయవాది వామన్ రావు హత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కుంట శీను, చిరంజీవి ఇద్దరూ పథకం ప్రకారమే హత్య చేశారని తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత రామ గిరి నుండి సుందిళ్ళ బ్యారేజీ ద్వారా మహరాష్ట్ర సరిహద్దుకు చేరుకున్నారని పోలీసులు గుర్తించారు. తర్వాత సుందిళ్ళ బ్యారేజ్ లో బట్టలతో పాటు కత్తులు,,సెల్ ఫోన్లు పడేసి వెళ్లారని గుర్తించారు.
బట్టలు పడెసిన అనంతరం వేరే బట్టలు మార్చుకుని పరారయ్యారని గుర్తించారు. ఉదారి లచ్చయ్య ,అక్క పాక కుమార్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని కుంట శీనుకు అందించారని చెబుతున్నారు. హత్యకు వినియోగించిన కత్తులు, వాహనం బిట్టు శీను సమకూర్చారని గుర్తించారు పోలీసులు. రిమాండ్ రిపోర్టు లో ముగ్గరుని అరెస్ట్ చేసి మరో ఇద్దరు బిట్టు శీను, లచ్చయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.