వామ్మో: కేజీఎఫ్ 2 ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా.. ?

-

బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని వసూళ్ళ పరంగా దూసుకుపోతున్న సినిమా ఇది అని చెప్పవచ్చు.. ఇక ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అప్పుడే రూ.1000 కోట్ల మార్క్ ను కూడా దాటేసింది ఇదిలా ఉండగా ఈ చిత్రం తాజాగా మరో రికార్డును సృష్టించి.. అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులకు మంచి పేరు రావడమే కాకుండా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్రెండ్ సెట్టర్ గా మారిపోయారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి సౌత్ స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు.

ఇక ఇప్పటికే ఎన్టీఆర్ కూడా సతీ సమేతంగా ప్రశాంత్ కుటుంబాన్ని కలిసినట్లు అక్కడ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నట్లు కూడా సమాచారం. ఇకపోతే కే జి ఎఫ్ టు హక్కులను ప్రముఖ ఓ టీటీ ప్లాట్ఫామ్ రికార్డు మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఏకంగా రూ.320కోట్లకు కొనుగోలు చేసిందట అమెజాన్ ప్రైమ్. ఇకపోతే అమెజాన్ ప్రైమ్ లో మే 27వ తేదీ నుండి కన్నడ , తమిళ్ , తెలుగు, హిందీ అలాగే మలయాళం భాషలలో ప్రసారం కానుంది. ఇకపోతే ఏ సినిమా కూడా ఇంతటి కలెక్షన్లను రాబట్ట లేదు. అత్యధిక వసూళ్లు రాబట్టిన సౌత్ ఇండస్ట్రీ ఫిలింగా కేజిఎఫ్ 2 రికార్డు సృష్టించింది.ఇకపోతే 2018 చిత్రం కే జి ఎఫ్ వన్ కి సీక్వెల్ గా 70 ల నాటి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో పవర్ డైనమిక్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.1000 కోట్ల రూపాయలను రాబట్టడం సెన్సేషన్ అని చెప్పవచ్చు. బాలీవుడ్ లో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా కూడా ఈ సినిమా గుర్తింపు దక్కించుకుంది. ఇక ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి సంజయ్ దత్, రవీనా టాండన్, అర్చన జోయిస్, రావు రమేష్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఇక వీరందరికీ కూడా మంచి గుర్తింపు లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version