వామ్మో .. ప్రగతి ఆంటీ ఒక్కరోజు పారితోషకం తెలిస్తే దిమ్మ తిరిగి పోద్ది..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఎన్నో సినిమాలలో పద్ధతికి చీర కట్టినట్టుగా చాలా సాంప్రదాయంగా అత్తగా, అమ్మగా, అక్కగా , వదినగా ఇలా పలు ముఖ్యమైన పాత్రలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సినిమాలలో ఎంతో పద్ధతిగా కనిపించే ప్రగతి బయట మాత్రం చాలా బోల్డ్గా ప్రేక్షకులను కనువిందు చేస్తూ ఉంటుంది. ఇక తనకు నచ్చినట్టుగా జీవిస్తూ.. ఎద అందాలను చూపిస్తూ హాట్ క్లీవేజ్ షో తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు జిమ్లో ఈమె చేసే ఎక్ససర్శైజ్ వీడియో లను కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ..ఐదు పదుల వయసులో కూడా ఇంత స్ట్రాంగ్ ఎలా అంటూ ఒక్కోసారి ఈమె ఫిట్నెస్కు ప్రశంసలు కూడా అందిస్తూ వుంటారు.

ఇకపోతే అటు సినిమాల ద్వారా ఇటు సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ ను సొంతం చేసుకున్న ప్రగతి రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటుంది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఇకపోతే ప్రగతి ఎంచుకునే పాత్రను బట్టి, సినిమా బడ్జెట్ ను బట్టి ఆమె పారితోషికం ఉంటుంది అన్నట్లుగా ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక స్టార్ హీరోల సినిమాలలో భారీ బడ్జెట్ తో తెరకెక్కే చిత్రాలలో నటి ప్రగతి నటిస్తే ఒక్కరోజుకు ఆమె పారితోషకం సుమారుగా 70 వేల రూపాయలు ఉంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ను బట్టి ఈమె తీసుకునే పారితోషకం కూడా అంతకుమించి ఉంటుందని సమాచారం.

ఇదిలా ఉండగా తాజాగా ప్రగతి ఒక రెస్టారెంట్లో చిల్ అవుతూ అందుకు సంబంధించిన ఫోటోలకి కూడా ఫోజులు ఇచ్చారు. ఇకపోతే సోషల్ మీడియా ద్వారా రకరకాల ఫోటోలను నెటిజన్ల తో పంచుకుంటూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఈమె ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ తన సినీ కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. దర్శక నిర్మాతలే కాదు ఒక హీరో కూడా ఒక రోజంతా తనతో గడిపితే సినిమాలలో అవకాశాలు ఇస్తానని ఇబ్బంది పెట్టారని కూడా ఆమె తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version