టెన్త్ క్లాస్ లో టాప్ మార్క్స్ సాధించిన వాణి వీణలు..!

-

vani veena scored top marks in 10 class exams
vani veena scored top marks in 10 class exams

తెలుగు రాష్టాల ప్రజలకి బాగా గుర్తుండే కవలలు వాణి వీణలు, తలలు అంటుకొని పుట్టిన వాణి వినాలు మన అందరికీ సుపరిచితమైన వారే. ఇక వాణి వీణలు పదవ తరగతి పూర్తి చేసుకున్నారు, కాగా పదవ తరగతి పరీక్షల్లో వీరు తమ సత్తా చాటారు. మార్చి నెలలో జరిగిన మూడు పరీక్షలకు వీరు హాజరయ్యారు వాణి 9.2 జీపీఏ సాధించగా వీణ 9.3 జీపీఏ సాధించింది. ప్రభుత్వం వీరిని ప్రత్యేఖ వాహనంలో పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లగా హైదరాబాద్ మధురానగర్ లోని ప్రతిభ హైస్కూల్ లో వేర్వేరు హాల్ టికెట్లతో వారు పరీక్షలు రాశారు. కోవిడ్ నేపద్యంలో పదవ తరగతి పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే వీరు మూడు పరీక్షలకు హాజరయినప్పటికి మరో మూడు పరీక్షలు మార్కులు వీరి ఇంటర్నల్ అస్సెస్ మెంట్ మార్కుల ద్వారా ఇవ్వబడ్డాయి. పదవ తరగతి పూర్తి చేసుకున్నా వీళ్ళు ఇప్పుడు ఇంటర్ లో ఎం‌ఈ‌సి చేసేందుకు నిశ్చయించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news