పోలీసు అధికారులు రాజకీయ నాయకులందరిని ఒకేలా చూడాలి : వర్ల రామయ్య

-

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన అయ్యన్నను అప్పటికే అక్కడున్న కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాత్రుడిపై కృష్ణాజిల్లా పోలీసులు కేసు నమోదు చేసి విశాఖపట్నం విమానాశ్రయంలో అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాబు తదితర జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులపై వైసీపీ నేతలు పేర్ని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్.కే. రోజా చేసిన, చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై కేసులు ఉండవా? అని పోలీసు అధికారులను వర్ల ప్రశ్నించారు.

పోలీసు అధికారులు రాజకీయ నాయకులందరిని ఒకేలా చూడాలని, ఒకరిని నెత్తికెత్తుకొని మరొకరిని కింద పడేస్తామంటే అది మంచి పద్ధతి కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, అందరికీ చట్టం ఒకేలా ఉండాలని, చట్టం కొందరికి చుట్టం కాకూడదని, అలా చూసుకోవలసిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని వర్ల గుర్తు చేశారు. విచిత్రంగా, అధికారంలోకి వచ్చిన నాటి నుండి, ఈ ప్రభుత్వం రెండు వర్గాల మధ్య వైషమ్యాలు, శత్రుత్వాలు పెంచుతున్నారనే నెపంతో, ఐపీసీ సెక్షన్ 153 (A)ను పదే పదే, ప్రతిపక్షాలపై ఉపయోగించి, ఆ సెక్షన్ ను దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version