ఆధారాలు చూశాక గవర్నర్‌ ఆశ్చర్యపోయారు : వర్ల రామయ్య

-

నేడు టీడీపీ నేతలు బొండా ఉమ, వర్ల రామయ్య తదితరులు రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. వారు అక్కడ అవినాశ్ రెడ్డి వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపధ్యం లో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, అవినాశ్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని అడిగారు. ఎవరో ఆకు రౌడీలు వచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదని బెదిరిస్తే అరెస్ట్ చేయకుండా వెనక్కి వచ్చేస్తారా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు ఆయన. “రాష్ట్రంలో టీచర్లు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే వాళ్లను నియంత్రించారు. టీడీపీ నేతలు రోడ్డు మీదికి వస్తే కంట్రోల్ చేశారు. కమ్యూనిస్టులు, ఇతర విపక్ష నేతలు రోడ్ల మీదికి రాకుండా గృహ నిర్బంధాలు చేశారు కదా. అవినాశ్ రెడ్డి కాన్వాయ్ వందలాంది వాహనాలతో ఊరేగింపుగా వస్తుంటే ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు రామయ్య.

వీటన్నింటిపై ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించాం. ఇవన్నీ చూశాక ఆయన ఆశ్చర్యపోయారు అని తెలిపారు. నిజమా? అని అడిగారు. అయితే మేము నిజమే సార్ అని చెప్పాం … కావాలంటే వాళ్ల మీడియా కరపత్రం, వాళ్ల టీవీ చానల్ తప్ప మిగతా చానళ్లు చూడాలని చెప్పాం అని అన్నారు. ఏపీలో సీబీఐ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. ఎక్కడైనా సీబీఐ వస్తే స్థానిక పోలీసులు భయపడతారు. కానీ జగన్ పాలనలో స్థానిక పోలీసులే సీబీఐ వాళ్లను బెదిరిస్తున్నారు . లోకల్ పోలీసులే దర్యాప్తు అధికారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం… సీబీఐ పరిస్థితి ఇంత దయనీయంగా ఏపీలోనే ఉందా, లేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఉందా? అంటూ ఆయన ప్రశ్నించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version