ఐపీఎల్ 2023: “నో బాల్” ద్వారా రెండో ఓవర్లోనే గైక్వాడ్ కు లైఫ్ …

-

రోజు ఐపీఎల్ లో భాగంగా చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్యన క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. సాధారణంగా ఈ సీజన్జ్ లో గుజరాత్ టాస్ గెలిచిన చాలా సార్లు బ్యాటింగ్ ఎంచుకుని ప్రత్యర్థుల ముందు భారీ టార్గెట్ ను అందిస్తూ వచ్చారు. కానీ గత రెండు మ్యాచ్ ల నుండి చూస్తే మాత్రం .. ఛేజింగ్ ఎంచుకుని భిన్నమైన వ్యూహం తో ముందుకు వెళుతుండడం క్రికెట్ ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాగా మొదట బ్యాటింగ్ చేస్తున్న చెన్నై కు ఓపెనర్లుగా ఋతురాజ్ గైక్వాడ్ మరియు కాన్ వే లు వచ్చారు, మొదటి ఓవర్ లో చాలా నిదానంగా ఆడిన చెన్నైకు రెండవ ఓవర్ లో మూడవ బంతికి భారీ షాక్ తగిలింది.

దర్శన్ నల్ కండే బౌలింగ్ లో ఋతురాజ్ గైక్వాడ్ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. కానీ ఆ బంతి నో బాల్ కావడంతో ఋతురాజ్ కు భారీ లైఫ్ దొరికింది, దీనితో రెచ్చిపోయిన ఋతురాజ్ వరుసగా సిక్స్ మరియు ఫోర్ కొట్టి టచ్ లోకి వచ్చాడు. మరి ఈ లైఫ్ తో ఋతురాజ్ భారీ ఇన్నింగ్స్ ఆడుతాడా చూద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version