గత కొన్ని రోజులుగా ‘వాట్సాప్ డైరెక్టర్‘ వరుణ్ పుల్యానీ పేరుతో వస్తున్న ఓ వాట్సాప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ మెసెజ్‌ని 20 మందికి ఫార్వార్డ్ చేయాలనీ.. లేకపోతే వాట్సాప్ సేవలు కొనసాగాలంటే డబ్బులు చెల్లించాలని ఆ మెసెజ్‌తో ఉంది. వైరల్ ఆవుతున్న మెసెజ్‌లో ఇలా.. ‘దీన్ని విస్మరించొద్దు, దయచేసి జాగ్రత్తగా చదవండి. హలో, నేను వాట్సాప్ డైరెక్టర్ వరున్ పుల్యానీ ఈ మెసెజ్ మా యూజర్స్ అందరికీ మేము 19 బిలియన్ డాలర్లకు మార్క్ జుకర్‌బర్గ్‌కు వాట్సాప్‌ను విక్రయించాం. వాట్సాప్ ఇప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ నియంత్రణలో ఉంది. మీరు కనీసం 20 మందికి ఈ మెసేజ్‌ను షేర్ చేయండి.. అప్పుడు మీ వాట్సాప్ లోగో 24 గంటల్లో ఫేస్‌బుక్ యొక్క ‘ఎఫ్‘తో కొత్త చిహ్నంగా మారడంతో పాటు నీలం రంగులోకి మారిపోతుంది. మీ కొత్త వాట్సాప్‌ను వినియోగించుకోవాలంటే ఈ సందేశాన్ని 10 మందికి పైగా ఫార్వార్డ్ చేయాలి, లేకపోతే మీ వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి‘ అని నకిలీ వాట్సాప్ సందేశంలో ఉంది.దీన్ని క్లిక్ చేసిన వారు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు.
ఓ యువతి ఆడియో..
దీంతో పాటు ఓ యువతి వాయిస్ కూడా హల్‌చల్ చేస్తోంది. ఆ ఆడియోలో ‘ఇప్పుడు వాట్సాప్ గురుంచి ఏదో చెప్పుతున్నారుగా. వాట్సాప్ పని చేయదు అది ఇది అని. అది నిజం కాదు వేరే కంపెనీ వాళ్లు వాట్సాప్‌ను కొన్నారు. వాళ్లేం చెప్పారంటే మన వాట్సాప్‌లోని 20 కాంటాక్ట్‌లకు ఈ సందేశాన్ని పంపితే మీకు వాట్సాప్ లోగో మారుతుంది. మారకపోతే వాట్సాప్ కి నెలకు రూ. 500 చెల్లించి వాడుకోవాలి’’ అని యువతి వాయిస్ మెసెజ్‌లో ఉంది.
ఆ పేరు ఎక్కడా లేదు..
తగ కొన్ని రోజులుగా వాట్సాప్ డైరెక్టర్ వరుణ్ పుల్యానీ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ మెసెజ్‌లు ఫార్వార్డ్ అవుతున్నాయి. నిజానికి వాట్సాప్ సంస్థలో కానీ.. కంపెనీ వెబ్‌సైట్ కానీ ఆ పేరుతో ఎవరూ లేరని నిపుణులు తెలుపుతున్నారు. వాట్సాప్ ప్రైవసీ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇలాంటి నకిలీ మెసెజ్ లను పంపుతున్నారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ ఇద్దరి వాయిస్‌లు నకిలీవని సంస్థ నుంచి అధికారికంగా వచ్చే సమాచారాన్ని నమ్మాలని పేర్కొంటున్నారు.