రష్మికతో చేయాలని ఉంది.. వరుణ్ తేజ్ కామెంట్స్

-

యంగ్ హీరో నితిన్ రష్మికమందాన్న కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు షాకింగ్ ఓపెనింగ్స్‌తో దుమ్ములేపింది. తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి.. నితిన్ కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. నిన్న (ఫిబ్రవరి 29) జరిగిన భీష్మ థ్యాంక్స్ మీట్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ ఈవెంట్‌లో రష్మిక మందాన్న, నితిన్‌లపై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

సినిమా అంతా నిజాయితీగా తీశాడని, అయితే ఓ విషయంలో మోసం చేశాడని అన్నాడు. భీష్మ.. సింగిల్ ఫరెవర్ అన్నాడని, కానీ ఫస్ట్ రీల్ ముగిసేసరికే పడేశాడని తెలిపాడు. సింగిల్‌గా ఉంటానని చెప్పి.. సినిమా విడుదలకు ముందే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని తెలిపాడు. అయితే ఏదేమైనా అతని విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని, ఈ సినిమా సక్సెస్ కంటే..పెద్ద అడుగు పెళ్లి చేసుకోవడమేనని అన్నాడు. అతినికి, శాలినికి కొత్త జీవితంలో అడుగు పెడుతున్నందుకు అభినందలను తెలిపాడు.

ఇక హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడుతూ.. రష్మిక గ్రేట్ ట్రాక్‌లో ఉందని అన్నాడు. ఈ సంవత్సరం ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’.. ఇదివరకు ‘గీత గోవిందం’, ‘ఛలో’ సినిమాలు చేసిందని పేర్కొన్నాడు. తను మంచి టాలెంట్ ఉన్న నటి అని కితాబిచ్చాడు. తనతో చేస్తే సినిమా హిట్టవుతుందని అంటారని, బహుశా త్వరలోనే ఆమెతో కలిసి చెయ్యాలని ఆశిస్తున్నానని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version