అలాంటి వారు యోగా అసలు మిస్ అవ్వొద్దు…!

-

పెరుగుతున్న జనాభా, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల పెరుగుతున్న కాలుష్యం, మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులకు పెరిగే టెన్షన్, ఒత్తిడి వల్ల అనేక మానసిక, శారీరక అనారోగ్యాలకు దారి తీస్తున్నాయి. వీటిని జయించడం కోసం ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో వ్యాయామం, యోగాని ఒక భాగం చేసుకోవాలి. ఒక మనిషి రోజూ అర గంటవ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.

వ్యాయామం అంటే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ స్విమ్మింగ్ వంటివి చేయడం వల్ల ఒత్తిడి ని దూరం చేయవచ్చు. పెరుగుతున్న బిజీ లైఫ్ లో పని టెన్షన్ లో పడి కూర్చున్న చోటు నుండి కదలకుండా పని చేయడం వల్ల 40 సంవత్సరాలకే అనేక రకాల రుగ్మతలు, దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయి. పూర్వం సూర్యోదయమునకు ముందే నిద్ర లేచి శారీరక అవసరాలు తీర్చుకునిఇంటి పని ముగించుకుని స్నాన సంధ్యలు పూర్తి చేసి సూర్య నమస్కారాలు చేసేవారు. ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది.ఇంటి పని చేయడం వల్ల శారీరక శ్రమ కలుగుతుంది.

దీనితో శరీరానికి చెమటలు పట్టి కావలసిన వ్యాయామం అందుతుంది. ఒత్తిడిని దూరం చేయడానికి వ్యాయామం తో పాటు యోగా కూడా మంచి సాధనం. వ్యాయామం చేయటానికి మాకు సమయం లేదు,బయటకు వెళ్ళి వాకింగ్ చేయడానికి వీలు లేని పరిస్థితి అనుకునేవారికి యోగా మంచి ఉపయోగం ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు. ఉదయాన్నే నిద్ర లేచి యోగాసనాలు చేయడం వల్ల, మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరానికి నూతన ఉత్సాహం కలుగుతుంది. కొన్నిరకాల వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version