‘వ‌రుణ్’ వాల్మీకి ప్రి రిలీజ్ బిజినెస్‌….. వ‌రుణ్ టార్గెట్ పెద్దదే..

-

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ – హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో తెరకెక్కిన సినిమా వాల్మీకి. రెగ్యులర్ ఫార్మాట్ కు దూరంగా సినిమాలు చేస్తూ వ‌రుస హిట్లు కొడుతోన్న వాల్మీకిపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఉన్నాయి. కోలీవుడ్‌లో సిద్ధార్థ్ హీరోగా తెర‌కెక్కి సూప‌ర్ హిట్ అయిన జిగ‌ర్‌తండాకు ఇది రీమేక్‌. ఎఫ్ 2 త‌ర్వాత వ‌రుణ్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలే ఉన్నాయి. శుక్ర‌వారం వాల్మీకి థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో వాల్మీకి సత్తా చాటాడు. వ‌రుణ్ ఈ సినిమాతో పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు. వాల్మీకి ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా 25 కోట్లకు పైగా చేసింది. భారీ కాంపిటీష‌న్ మ‌ధ్య సినిమా రైట్స్ అమ్ముడ‌య్యాయి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సేఫ్ అవ్వాలంటే రూ.20 కోట్ల షేర్ రాబ‌ట్టాల్సి ఉంటుంది.

వాల్మీకి ప్రి రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా ఇలా ఉంది…


నైజం – 7. 40
సీడెడ్ – 3. 35
ఉత్తరాంధ్రా – 2. 40
ఈస్ట్ – 1. 60
వెస్ట్ – 1. 10
గుంటూరు – 1. 80
కృష్ణా – 1. 60
నెల్లూరు – 1. 60
ఏపీ+తెలంగాణ = 20 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా – 0. 03
కర్ణాటక – 1. 02
ఓవర్ సీస్ – 3. 50
వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ = 25 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version