యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామానికి మహర్ధశ పట్టనుంది. మరో అంకాపూర్ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మాట నిలబెట్టుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ నియమించి, ప్రతి కుటుంబానికి లబ్ది పొందేలా చూడాలని సీఎం ఆదేశించారు.
సీఎం కేసీఆర్ జనగామ లో సభ ను ముగించుకొని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్తుండగా వాసాలమర్రిలో కాసేపు ఆగారు. గ్రామస్తులతో మాట్లాడి గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్య లను ఆడిగి తెలుసుకొన్నారు. గ్రామ సర్పంచ్ తో కలిసి పామ్ హౌస్ రావాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పామ్ హౌస్ వెళ్లిన గ్రామస్తులతోను ముచ్చటించిన సీఎం కేసీఆర్, మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే అధికారులను గ్రామానికి పంపిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే కలెక్టర్ అనిత రామ చంద్రన్ గ్రామానికి పంపించి, మౌలిక సదుపాయాల కల్పన పైన గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేయించారు.డిఆర్డీఓ పిడి ఉపేందర్ రెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమించారు.
సీఎం కేసీఆర్ చొరవతో ఆ గ్రామానికి మహర్ధశ…!
-