ఏపీ మహిళా కమిషనర్ చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల తరుణంలో ఆమె ఎందుకు రాజీనామా చేశారు అని అంతా ఆరా తీస్తున్నారు. రాజీనామా వెనుక రాజకీయం లేదంటున్నారు వాసిరెడ్డి పద్మ రాష్ట్ర మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా రాజీనామా చేసానని అన్నారు ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన మాత్రమే రాజీనామా కి కారణం కాదు అని అన్నారు.
పోటీ చేయడమే గీటు రాయి కాదు అని కొందరు అనుకుంటూ ఉండొచ్చు అన్నారు బలాబలాల కారణంగా ఏమైనా అవకాశం ఉండకపోవచ్చు నాకు సీట్ వచ్చిందా లేదా అనేది ముఖ్యం కాదు పార్టీ ఆదేశించిన ఆదేశించకపోయినా అన్నిటికీ సిద్ధమే అని వాసిరెడ్డి పద్మ అన్నారు ఎన్నికల సమయంలో ప్రచార బాధ్యతలు నిర్వహించడానికి ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు పద్మ అన్నారు.