గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి ఎన్నో వార్తలు వింటున్నాం టిడిపి జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే అయితే పార్టీలతో బిజెపి కూడా జతకడుతుందని ప్రచారం జరుగుతుంది ఇది నిజమేనని సంకేతాలు కనబడుతున్నాయి. టిడిపి జనసేన అధినేతలు గురువారం ఢిల్లీ వెళ్లడం జరిగింది ఈ బీజేపీ పెద్దల్ని కలవబోతున్నారు.
ఈ మేరకు పొత్తుల మీద క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక కామెంట్స్ చేశారు. మంగళగిరిలో మీడియాతో ఆయన మాట్లాడారు చంద్రబాబు జనసేన ఢిల్లీ పర్యటనతో బిజెపితో పొత్తు పై క్లారిటీ వస్తుందని అన్నారు అసలు పొత్తులు ఉంటాయా లేదా అనేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ త్వరలో చెప్పబోతున్నట్లు చెప్పారు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది.