ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే… అప్పుల బాధ తీరుతుందట.. చెత్తకుండీ అక్కడ అసలు పెట్టొద్దు

-

మనం నమ్మినా లేకున్నా..చుట్టు ఉండే వస్తువులు..వాటిస్థానాలు మన మైండ్ సెట్ మీద ప్రభావితం చూపిస్తాయి. దీన్నే కొందరు వాస్తు అంటారు. మరికొందరు సైన్స్ అంటారు. ఆ వాస్తు చిట్కాలు పాటిస్తే..అప్పులు బాధ కూడా తీరుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఎంత సంపాదించినా అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీ ఇల్లు, కార్యాలయాన్ని వాస్తుకు అనుగుణంగా నిర్మించడం ద్వారా అనేక సమస్యలు తొలగుతాయని సూచిస్తున్నారు. అన్ని విషయాల్లో వాస్తును పాటించడం ద్వారా మీ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ, డబ్బును తెచ్చిపెడుతుందని నిపుణులు అంటున్నారు.

వాస్తు సూత్రాల ప్రకారం ఏ దిశలో ఎలాంటి వస్తువులు ఉండకూడదో ఇప్పుడు చూద్దాం.

ఈశాన్యం

సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. ఈశాన్యంలో చెత్తకుండీ, మరుగుదొడ్డి, డ్రైనేజీ పిట్, చీపురు వంటి వస్తువులు అస్సలు పెట్టకూడదు. అవి మీ ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. దీంతోపాటు వాస్తు ప్రకారం ఇవి అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తాయట.

తూర్పు ఆగ్నేయం

తూర్పు ఆగ్నేయ దిశలో వాస్తు పాటించకపోవడం వల్ల ఆందోళనలు పెరుగుతాయట. పూర్వ కాలంలో ఈ దిశలోనే వెన్న తయారీ చేసేవారు. అందువల్ల, ఇప్పుడు మిక్సర్-గ్రైండర్ను ఈ దిశలో పెట్టుకోవడం మీకు కలిసొస్తుంది. ఈ దిశలో వాస్తు దోషాలు ఉంటే మీకు నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి.

దక్షిణ నైరుతి పశ్చిమ దిశ

వాస్తు ప్రకారం దక్షిణ- నైరుతి- పశ్చిమ దిశ వృథా ఖర్చులకు పెట్టింది పేరట. మీరు ఈ జోన్‌లో నిద్రిస్తే లేదా మీ ఇంటి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉన్నట్లయితే మీరు అప్పుల పాలవుతారు. అందువల్ల, ఈ దిశలో ప్రధాన ద్వారం పెట్టకూడదు.

ఉత్తర, ఆగ్నేయ దిశలు

అవకాశాలకు వారధి ఉత్తరం దిశ. నగదు ప్రవాహానికి వారధి ఆగ్నేయ దిశ అని వాస్తు నిపుణులు అంటారు. ఉత్తరం దిశలోని గోడలకు ఎరుపు వేయడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. అదేవిధంగా ఆగ్నేయంలోని నీలం రంగు మీ నగదు ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి ఈ దిశల్లో ఎరుపు, నీలం రంగు గోడలకు వేయవద్దు.

గమనిక: వాస్తు నిపుణులు చెప్పినదాని ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం. మనలోకం సొంతంగా చెప్పింది కాదు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version