ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇల్లు ని అందంగా మార్చుకోవాలని చూస్తూ ఉంటారు ముఖ్యంగా అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే ఇల్లుని వివిధ రకాలుగా మార్చుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంట్లో అందమైన మొక్కలని పెంచుతున్నారు. అలానే చక్కటి బాల్కనీని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కొందరైతే ఆర్టిఫిషియల్ గ్రాస్ ని కూడా ఇంట్లో పెడుతున్నారు. మీరు కూడా ఆర్టిఫిషియల్ గ్రాస్ ని ఇంట్లో పెడుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని పాటించండి పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు వీటిని అనుసరిస్తే ఏ ఇబ్బంది ఉండదు.ఆర్టిఫిషల్ గ్రాస్ కోసం ఎక్కువ శ్రద్ధ పెట్టక్కర్లేదు కానీ చెత్తాచెదారం ఎక్కువ పేరుకు పోతుంది ఇది నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. ఒకవేళ కనుక మీరు క్లీన్ చేయకపోతే పాజిటివ్ ఎనర్జీ రాదు నెగటివ్ ఎనర్జీ ఉంటుంది.
అలానే వాస్తు ప్రకారం మేడ మీద ఆర్టిఫిషియల్ గ్రాస్ ని పెట్టొద్దు. వీలైనంతవరకు నిజమైన మొక్కలని మాత్రమే పెట్టుకోండి.
అలానే ఆర్టిఫిషల్ గ్రాస్ ని కానీ ఆర్టిఫిషియల్ మొక్కల్ని కానీ వంటగదిలో బాత్రూంలో పెట్టుకోకూడదు. అలానే పూజ గదిలో కూడా వీటిని పెట్టకూడదు దీని వలన ఇబ్బందులు కలుగుతాయని పండితులు అంటున్నారు. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాల్ని వీటిని పాటించి ఏ ఇబ్బంది లేకుండా ఉండండి.