వాస్తు: పూజ చేసేటప్పుడు ఈ తప్పులని అస్సలు చెయ్యద్దు..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి బాధ కూడా ఉండదు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన వాస్తు దోషాలు మొదలైన ఇబ్బందులు కూడా ఉండవు చాలామంది తెలియక చిన్న చిన్న తప్పులను చేస్తూ ఉంటారు ఇటువంటి తప్పులు చేయడం వలన నెగటివ్ ఎనర్జీ వచ్చి పాజిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు మరి పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలను ఇప్పుడే చూసేద్దాం.

ప్రతిరోజు మీ ఇంట్లో మీరు పూజ చేస్తే ఖచ్చితంగా ఆనందం అక్కడ ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
అలానే మీరు పూజ చేసే చోట ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి.
ఎప్పుడూ కూడా మీరు పూజ గదిలో విరిగిపోయిన దేవుడి విగ్రహాలు ఉండకూడదు. దీపాలు ఎప్పుడు పూజ గదిలో వెలిగించాలి ముఖ్యంగా సాయంత్రం పూట పూజ గదిలో దీపాలని వెలిగించాలి.
స్నానం చేయకుండా పూజ గదిలోకి వెళ్ళరాదు.
పురాణాల ప్రకారం గణేశుడు ని మొదట పూజించాలి. కనుక మీ పూజ గది లో ఒక్క వినాయకుడి విగ్రహమైనా ఉండాలి.
అలానే వాస్తు ప్రకారం లక్ష్మీదేవికి ఎడమవైపు వినాయకుడు ఉండాలి. అలానే లక్ష్మీదేవి సరస్వతి దేవి కుడివైపున ఉండేటట్టు చూసుకోవాలి.
ఎప్పుడైనా సరే మీరు వినాయకుడి విగ్రహాన్ని పెట్టేటప్పుడు కూర్చుని ఉన్న గణేశుడు విగ్రహాన్ని మాత్రమే పెట్టాలి గుర్తుంచుకోండి.
అలానే ఇంట్లో హనుమంతుడి విగ్రహాన్ని కూడా ఉంచాలి సమస్యలన్నీ దూరం చేస్తాడు హనుమంతుడు.
చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలను మరి వీటిని అనుసరించి ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version