వాస్తు: శివుడిని ఈ దిశలో పెడితే.. అంతా శుభమే..!

-

వాస్తు ప్రకారం ఫాలో అయితే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది చాలా మంది వాస్తు కి తగ్గట్టుగా ఫాలో అవుతున్నారు. అప్పుడు సమస్యలే లేకుండా హాయిగా ఉండొచ్చు పైగా వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగటివ్ ఎనర్జీ తొలగి పోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది హిందువులందరూ కూడా శివుడిని పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా సోమవారం నాడు శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు.

శివుడిని ఈ విధంగా మనం ఇంట్లో పెడితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా శివుడిని ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శివుడుని ఎప్పుడూ ఉత్తర దిశలో పెడితే ఇంటికి ఎంతో మేలు కలుగుతుంది అందుకని ఉత్తర దిశలో శివుడిని పెట్టండి. ఎప్పుడూ కూడా కోపంగా ఉన్న శివుడి ఫోటోని ఇంట్లో ఉంచకూడదు ఇవి సమస్యల్ని కలిగిస్తూ ఉంటాయి నెగటివ్ ఎనర్జీని తీసుకువస్తూ ఉంటాయి. నవ్వుతున్న శివుడుని ఇంట్లో పెడితే ఎంతో మేలు కలుగుతుంది.

శివుడి కుటుంబంతో పాటుగా ఫోటోని పెడితే కూడా మేలు కలుగుతుంది ఇలాంటి ఫోటోలు పెట్టడం వలన పిల్లలు కూడా మంచిగా ఉంటారు. వారి ప్రవర్తన బాగుంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం శివుడి ఫోటోని ఇంట్లో పెట్టినప్పుడు అందరికీ కనపడేలా పెట్టాలి ఇలా చేయడం వలన చక్కటి ప్రయోజనాలని పొందవచ్చు. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే సమస్యలు ఏమి లేకుండా సంతోషంగా జీవించొచ్చు. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలను మరి వీటిని అనుసరించి ఏ బాధ లేకుండా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news