వివేకా హత్య కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై తీర్పును వాయిదా వేయడం జరిగింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం అనారోగ్యం రీత్యా బెయిల్ పైన భాస్కర్ రెడ్డిని విడుదల చేయాలని భాస్కర్ రెడ్డి తరపున లాయర్లు పిటీషన్ వేశారు. దీనిపై సిబిఐ కోర్ట్ లో అటు భాస్కర్ రెడ్డి తరపు లాయర్లు మరియు మరియు సునీత తరపు లాయర్లు వాదనలు వినిపించారు. కాగా సునీత తరపున లాయర్లు ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. కాగా ఈ వాదనలు అన్నీ విన్న సిబిఐ కోర్ట్ సునీత తరపున లాయర్లను రాత పూర్వకముగా వాదనలు కోర్ట్ కు సబ్మిట్ చెయ్యాలని ఆదేశించింది.
దీనితో ఈ పిటీషన్ పై తీర్పును ఈ నెల 9 కి వాయిదా వ్యేటం జరిగింది. కాగా ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్ట్ ముందస్తు బెయిల్ ఇవ్వగా.. తన తండ్రికి కూడా బెయిల్ ను పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.