వాస్తు: వ్యాపారం బాగుండాలంటే ఈ మార్పులు చేసుకోండి..!

-

చాలా మంది వ్యాపారంలో బాగా లాభాలని పొందాలని అనుకుంటారు. పైగా దానికి తగ్గ కష్టాన్ని కూడా పడుతూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం ఉండకపోవచ్చు. మీ వ్యాపారం లో కూడా సమస్యలు వస్తున్నాయా..? మంచిగా ఆదాయాన్ని పొందలేకపోతున్నార..? అయితే మీకోసం కొన్ని వాస్తు చిట్కాలు.

ఈ వాస్తు చిట్కాలను కనుక మీరు అనుసరిస్తే కచ్చితంగా మీ వ్యాపారంలో లాభాలు వస్తాయి. అలానే ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. అయితే మరి ఎలాంటి వాస్తు చిట్కాలను పాటిస్తే వ్యాపారం బాగుంటుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి.

మీ షాపు లేదా ఆఫీస్ ముఖద్వారం దగ్గర గణపతి ఫోటోలు పెట్టండి. ఇలా చేయడంవల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి లోపలికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కావాలంటే మీ ఇంట్లో కూడా దీనిని పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే వ్యాపారంలో లాభాలు బాగా వస్తాయి.

అలానే ఎప్పుడూ కూడా మీ యొక్క ఆఫీస్ ని శుభ్రంగా ఉంచుకోవాలి. అనవసరమైన చెత్తాచెదారం ఇంట్లో ఉండటం వల్ల నష్టాలు వస్తాయి. అలానే ఆఫీస్ లో, షాపుల్లో కూడా విరిగి పోయిన వస్తువులు పని చేయని వస్తువుల్ని ఉంచకూడదు. వీటిని ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఈ తప్పులు ఎప్పుడు చేయొద్దు.

పిరమిడ్ పెట్టుకుంటే కూడా మంచిది. ఇది పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. ఇంట్లో లేదా షాపు లేదా ఆఫీసులో దీనిని పెడితే బాగుంటుంది కొత్త సంవత్సరం సందర్భంగా మీరు ఇంట్లో మరియు బిజినెస్ లో ఈ మార్పులు చేస్తే కచ్చితంగా మంచి లాభాలు పొందడానికి అవుతుంది. కనుక పండితులు చెప్పిన ఈ విధంగా ఫాలో అయ్యి వ్యాపారంలో బాగా రాణించండి.

Read more RELATED
Recommended to you

Latest news