ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు లేకుండా ఏ ఇల్లు ఉండదు. మీ ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువగా వస్తున్నాయా..? ప్రశాంతత అస్సలు ఉండడం లేదా..? మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా..? అయితే కచ్చితంగా పండితులు చెబుతున్న ఈ పరిష్కారాన్ని చూడండి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా అనుసరిస్తే ఏ బాధ ఉండదు. ప్రశాంతంగా ఉండొచ్చు. సమస్యలన్నిటికీ దూరంగా ఉండొచ్చు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. మరి ఇక మనం పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాల కోసం చూసేద్దాం.
ఇంటి లోపల మొక్కలు:
ప్రశాంతంగా లేనట్లయితే ఇంటి లోపల మొక్కల్ని పెట్టండి ఇవి మీ ఇంటి వాస్తు దోషాలని తొలగిస్తాయి. పాజిటివ్ ఎనర్జీ కలిగేలా చూసి నెగటివ్ ఎనర్జీ ని దూరం చేస్తాయి.
ఇంటి ముఖ ద్వారం:
మీ ఇంటి ముఖద్వారం కూడా మ్యాజిక్ చేస్తుంది ఇబ్బందులేమీ లేకుండా ప్రశాంతంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది. మీ ఇంటి ముఖద్వారం ఎప్పుడు ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉండాలి. ఇలా ఇంటి ముఖ ద్వారం ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అలానే ఇంటి ముఖద్వారం బయట షూ స్టాండ్ లేదంటే జంతువుల బొమ్మలు వంటివి ఉంచకండి.
వంటగది:
ఇక వంటగది విషయానికి వస్తే వంటగదిలో ఎప్పుడూ బ్రైట్ కలర్స్ ఉండాలి. బ్రైట్ కలర్స్ ఉండడం వలన పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
బెడ్ రూమ్:
మీ బెడ్ రూమ్ ఎప్పుడూ కూడా రిలాక్స్ గా ఉండేటట్టు చూసుకోండి. నిద్రపోయేటప్పుడు మీ మంచం దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ ఉండాలి అంటే మీ కాళ్లు ఉత్తరం వైపు కానీ తూర్పు వైపుకి కానీ ఉండాలి. ఇలా బెడ్ రూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పాజిటివ్ ఎనర్జీ వ్యాపించి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.