వాస్తు టిప్‌: మీరు వాడే మొబైల్‌ గురించి ఈ విషయం మీకు తెలుసా?

-

ఏంటీ? మొబైల్‌ ఫోన్‌కు వాస్తు చిట్కానా? అని ఆశ్చర్చపోకండి. ఈ విషయం తెలిస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది. సాధరణంగా మన అందరి సెల్‌ఫోన్‌లకు రింగ్‌టోన్‌ అదేవిధంగా ఇంటికి డోర్‌ బెల్‌ ఉంటంది. దీని ద్వారానే మనం అలర్ట్‌ అవుతాం. అయితే ఇది అందరికీ తెలిసిందే కదా! అనుకోకండి. ఈ మొబైల్‌ ఫోన్, డోర్‌ బెల్‌ రింగింగ్‌ శబ్దాలా సౌండ్‌ ఫ్రీక్వెన్సీ కూడా వాస్తుపరంగా ఎంతో జాగ్రత్త వహించాలి అదేంటో తెలుసుకుందాం. ఈ రోజు వాస్తుశాస్త్రంలో మన ఇళ్లలో ఉండే అనేక రకాల ధ్వని పౌన్ః పున్యం, అవి ఉత్పత్తి చేసే ప్రకంపనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ప్రతిరోజు మన జీవితంలో భాగమైన అతి ముఖ్యమైన వస్తువులు మొబైల్‌ ఫోన్, గడియారం, డోర్‌ బెల్‌. ఇవి ఇంట్లో ధ్వనిని సృష్టిస్తాయి. ఈ ధ్వని లేదా ప్రకంపనాలు మన ఇంటి వాతావరణంపై తీవ్రప్రభావం చూపుతుంది. ఇవి శబ్దం చేసే విధానమే మన చుట్టుపక్కల వాతావరణంపై కూడా ఎఫెక్ట్‌ పడుతుంది. అందుకే మీ ఇంట్లో ప్రతిదీ ఎలా ధ్వనిస్తుందో జాగ్రత్త వహించాలి. ఇది వాస్తు ప్రకారం చాలా ముఖ్యమైన అంశం.
కొంతమంది తమ ఇష్ట ప్రకారం మొబైల్‌ రింగింగ్‌ టోన్‌లను పెట్టుకుంటారు. వాటి శబ్దం చాలా గట్టిగా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం ఇది మీ ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీకి దారితీయడమే కాకుండా దాన్ని ప్రభావాన్ని మరింత పెంచుతుంది. ఒక్కోసారి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ బేధాలకు, వారి మధ్య గొడవలు జరగటానికి కారణమవుతాయి. అందుకే మన ఇష్టంతోపాటు ఇతరుకు ఇబ్బంది కలిగించకుండా, వారికీ వినసొంపుగా ఉండే రింగ్‌టోన్‌లను మాత్రమే మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోండి. దీనివల్ల ఎవరికీ ఏ బాధా ఉండదు. మొబైల్‌తోపాటు గడియారం, డోర్‌బెల్‌ వంటి ఇతర వస్తువులపై కూడా రింగింగ్‌ విధానాన్ని సెట్‌ చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి. ఇటువంటివి వాయిస్‌ టెస్ట్‌ చేసిన తర్వాతే రింగింగ్‌ టోన్‌గా ఉపయోగించడం మంచిది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version