Veera Simha Reddy Trailer : ‘వీర సింహారెడ్డి’ ట్రైలర్ రిలీజ్.. బాలయ్య ఊచకోత మొదలు

-

బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్ లోకి రానున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మూవీ టీమ్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను కాసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది.  ఇవాళ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు నగరంలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

 

ఈ సందర్భంగా నే ఈ సినిమా ట్రైలర్ను ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఎప్పటిలాగే బాలయ్య తన పవర్ఫుల్ పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. మాస్ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉండేలా ఆయన కటౌట్ ఈ ట్రైలర్ లో మనం చూడవచ్చు. అటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ ట్రైలర్ కు బాగా సెట్ అయింది. ఓవరాల్ గా సినిమా హైప్ ను ఈ ట్రైలర్ అమాంతం పెంచేసింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news