సినీ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఓ మహిళ షాక్ ఇచ్చింది.జూబ్లీహిల్స్ రోడ్ నెం. 35లో పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇల్లు ఉంది. తొలుత రోడ్ నెంబరు 35 లోకి వచ్చిన మహిళ పవన్ ఇంటి ముందుకు వచ్చింది..ఆమె అనుమానాస్పదంగా అక్కడే సంచరిస్తుండడంతో సెక్యురిటీ సిబ్బంది ప్రశ్నించగా తాను పవన్ కల్యాణ్ను కలవాలని చెప్పింది. కుదరదు వెళ్లిపోవాలని చెప్పడంతో అక్కడున్న సెక్యూరిటీతో గొడవకు దిగింది. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది…
అయితే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లోకి పంపించకపోవడంతో మహిళ వాగ్వాదం పెట్టుకుంది. రాళ్లతో చుట్టుపక్కల వారిని కొడుతూ హంగామా చేసింది. అప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది వినకపోవడంతో.. ఆమె తన ఒంటిపై దుస్తులు తీసేసి అటూ ఇటూ తిరుగుతూ వీరంగం చేసింది.. అక్కడే వున్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు..ఆమెను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.
పోలీసులు ఆ మహిళ గురించి ఆరా తీయగా ఆమె తమిళనాడు రాష్ట్రంలోని మధురై వైఓత్తకాడై ప్రాంతానికి చెందిన జాయిస్ కమల అనే 36 మహిళగా తేలింది. గతంలో కూడా ఆమె హీరో సాయిధరమ్ తేజ్ ఇంటి ముందు ఇలాగే హంగామా చేసిందని, దీంతో తాము పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు..గతంలో చాలా సార్లు ఇలా చేసిందని గుర్తించారు..