వేడి వేడి వెజిటబుల్ రైస్ తయారీ చేద్దాం..

-

కావలసిన పదార్థాలు :
జీలకర్ర : అర టీస్పూన్
ఉల్లిగడ్డ : 1
అల్లంవెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్
క్యారెట్ : అర కప్పు
బీన్స్ ముక్కలు : అర కప్పు
పచ్చిబఠానీలు : అర కప్పు
గరంమసాలా : అర టీస్పూన్
కొత్తిమీర పౌడర్ : పావు టీస్పూన్
కారం : తగినంత
బియ్యం : 1 కప్పు
నీరు : రెండున్నర కప్పులు
కొత్తిమీర : తగినంత

తయారీ :
ముందుగా కడాయిలో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, పొడవుగా తరిగిన ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. ఇందులోనే పచ్చిబఠానీలు, క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి కలుపాలి. దీనికి గరంమసాలా, కొత్తిమీర పౌడర్, కారం, తగినంత ఉప్పు వేసి కలుపాలి. అరగంటపాటు నానబెట్టిన కప్పు బియ్యాన్ని మిశ్రమంలో కలిపి రెండున్నర కప్పుల నీటిని జోడించి, కట్‌చేసిన కొత్తిమీర కలిపి మూతపెట్టాలి. పది నిమిషాలపాటు ఉడికించి స్టౌ ఆఫ్ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత మూతతీసి చూస్తే గుమగుమలాడే వెజిటబుల్ రైస్ రెడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version