దేశంలో కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా టమాట కిలో 60 రూపాయలు ఉండగా కిలో ఉల్లిగడ్డ 60 రూపాయల పైగానే ఉంది. బెండకాయ, వంకాయ, దొండకాయ ,సొరకాయ ఇతర కూరగాయల ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే కూరగాయల ధరలు ఈ రేంజ్ లో పెరగడానికి కారణం దక్షిణ భారతదేశంలో కురుస్తున్న వర్షాలు అని తెలుస్తోంది. అదేవిధంగా డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల కూడా కూరగాయల ధరలపై ప్రభావం చూపుతోంది.
ట్రాన్స్ పోర్ట్ కు ఎక్కువ ఖర్చు అవ్వడం కూరగాయల ధరలపై ప్రభావం చూపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. భారీగా పెరుగుతున్న కూరగాయల ధరలతో కూరగాయలు కొనాలంటేనే ప్రజలు భయపడి పోతున్నారు. కూరగాయలు కాకుండా పప్పు, మాంసం తిందామన్నా వాటి ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.