హరీశ్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు : మంత్రి ఉత్తమ్

-

హరీశ్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడో అసలు అర్థం కావడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జలాల్లో బీఆర్ఎస్ చేసిన పొరపాటు వల్ల రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. హరీశ్ రావు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ఖరీఫ్ లో ఉమ్మడి ఏపీ కంటే ఎక్కువ వరి తెలంగాణలో పండిందని తెలిపారు. 

ఇక రబీలో 56 లక్షల ఎకరాల పైగానే సాగు జరుగుతోంది. తక్కువ నీటిని సమర్థవంతంగా సాగు జరుగుతోంది. తక్కువ నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాం. ఏపీకి బీఆర్ఎస్ ధారాదత్తంగా నీటిని వదిలిపెట్టింది. మేము అధికారంలోకి వచ్చాక రూల్స్ మార్చాలని ఒత్తిడి తెచ్చామని తెలిపారు. అసలు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్ నాం చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, జగన్ విందు వినోదాలు చేసుకున్నారని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news