హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షానికి కొట్టుకుపోయిన వాహ‌నాలు.. వైర‌ల్ వీడియో..!

-

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో బుధ‌వారం సాయంత్రం కురిసిన భారీ వ‌ర్షానికి ర‌హ‌దారుల‌న్నీ జ‌ల‌మ‌యంగా మారాయి. ర‌హ‌దారుల‌న్నీ చిన్న‌పాటి చెరువుల‌ను త‌ల‌పించాయి. న‌గ‌రంలోని గుడి మ‌ల్కాపూర్ ఏరియాలో కురిసిన భారీ వ‌ర్షానికి వాహ‌నాలు నీటిలో కొట్టుకుపోయాయి. ప‌లువురు వాహ‌న‌దారులు త‌మ వాహ‌నాల‌ను కొట్టుకుపోకుండా ప‌ట్టుకుని ఆపారు. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

బుధ‌వారం సాయంత్రం న‌గ‌రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. కుండ పోత వ‌ర్షానికి రోడ్ల‌పై భారీగా వ‌ర‌ద‌నీరు వ‌చ్చి చేరింది. వాహ‌న‌దారులు ఓ వైపు ట్రాఫిక్‌కు తోడు మ‌రోవైపు వ‌ర‌ద‌నీటిలో గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు.

కాగా హైద‌రాబాద్ న‌గ‌రానికి ఇప్ప‌టికే భారీ వ‌ర్ష సూచ‌న ఉంద‌ని వాతావ‌ర‌ణ విభాగం తెలిపింది. క‌నుక పౌరులు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఉండ‌డ‌మే ఉత్త‌మ‌మం.

Read more RELATED
Recommended to you

Exit mobile version