అధిష్టానం ప్రకటించకుండానే నామినేషన్ వేసిన వెలిచాల రాజేందర్ రావు…!

-

అధిష్టానం ప్రకటించకుండానే కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ కార్యక్రమం లో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల మీద ఇప్పుడైతే క్లారిటీ వచ్చేసింది. రాజేందర్ రావు కి అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేయచ్చేమో అనుకున్నారు.

ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తారని అంతా భావించినట్టే వెలిచెలా నామినేషన్ వేశారు. ఖమ్మం హైదరాబాద్ తో పాటు కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం రాజేంద్ర రావు తో పాటుగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీపడ్డారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కొడుకు రాజేంద్ర రావు 2009లో ప్రచారాజ్యం తరపున కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు రాజేంద్ర రావు లక్షకు పైగా సీట్లు సాధించి మూడు స్థానాలకి పరిమితమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news