విక్టరీ వెంకటేశ్ నెట్‌ఫ్లిక్స్‌పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఏకంగా గన్ చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ వెంకీకి కోపం తెచ్చేలా నెట్‌ఫ్లిక్స్ ఏం చేసింది..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
విక్టరీ వెంకటేశ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తోన్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డొనవన్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా వెంకీ ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
ఈ వీడియోలో వెంకీ.. చేతిలో గన్ పట్టుకొని నెట్‌ఫ్లిక్స్‌ను బెదిరిస్తున్నట్లు కనిపించారు. ‘పెద్ద తప్పు చేయొద్దు నెట్‌ఫ్లిక్స్.. హీరో ఎవరు?.. నేను, స్టార్ ఎవరు?.. నేను, కిరాక్‌గా కనిపించేది ఎవరు?.. నేను, ఫ్యాన్స్ ఎవరు?.. నా వాళ్లే. సో.. షో పేరు కూడా నాదే ఉండాలి. ‘రానా నాయుడు’ కాదు ‘నాగా నాయుడు’ అని ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. “మజాక్ మజాక్ మే అబ్దుల్ రజాక్ హో జాతా” అంటూ గన్ను టేబుల్‌పై విసిరేసి భయపెట్టించే పని చేశారు విక్టరీ వెంకటేశ్.’ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Tera naam bhi meine rakha, show ka naam bhi mein rakhega.#RanaNaidu ki aisi ki taisi. @RanaDaggubati @NetflixIndia pic.twitter.com/R3GYlwZsEl
— Venkatesh Daggubati (@VenkyMama) February 13, 2023