హ్యాపీ వాలెంటైన్స్ డే.. ప్రేమకీ భాష వుంది..కలకాలం అదే ప్రేమ ఉండాలంటే ఆ భాష రావాలిగా మరి..!

-

ప్రేమ అనేది ఒక చిన్న మ్యాజిక్ లాంటిది. ఎప్పుడు ఎలా ఎవరిలో పుడుతుంది అనేది ఎవరు చెప్పలేము. ఎవరూ ఊహించలేము ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ని జరుపుకుంటూ ఉంటాము. ఎలా అయితే ఆంగ్ల భాష తెలుగు భాష హిందీ భాషా ఉన్నాయో అలానే ప్రేమకి కూడా ఒక భాష ఉంది. ప్రేమకి భాష ఏమిటి అని ఆశ్చర్యపోకండి… నిజంగా ప్రేమకి భాష ఉంది.

మీ ప్రేమను కలకాలం నింపుకోవాలంటే ఆ ప్రేమ భాష మీకు తప్పక తెలియాలి. ప్రతి ప్రేమ కి కూడా భాష ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కానీ మీ ప్రియుడితో లేదా ప్రేయసి తో కానీ మీరు ప్రేమ భాషలోనే మాట్లాడాలి. ప్రేమ భాషలో మీరు సంభాషించగలిగితే మీ బంధం కలకాలం అలానే ఉంటుంది అందులో అనుమానం లేదు. ప్రేమ భాష లేకపోతే మీ ప్రేమ తరిగిపోతుంది.

చాలామంది అనుకుంటూ ఉంటారు కాలం గడిచే కొద్ది బంధం లో మార్పులు వస్తాయని. ప్రేమ తరిగిపోతుందని. కానీ ప్రేమ భాష ఉంటే అటువంటి పరిస్థితి ఏర్పడదు. భాష అంటే మీరేమీ కొత్తగా భాష నేర్చుకోక్కర్లేదు మీ జీవిత భాగస్వామి ఏ భాషని ఎక్కువగా ఇష్టపడుతున్నారో దానిని మీరు తెలుసుకుని అలా సంభాషిస్తే చాలు. మరి మీ ప్రేమని ఎలా కలకాలం ఉంచుకోవాలన్నా మీ జీవిత భాగస్వామితో మీరు ఆనందంగా ఉండాలన్నా ఈ విషయాన్ని అసలు మర్చిపోకండి.

సరదాగా తోడుగా…

మీ జీవిత భాగస్వామితో ప్రేమగా కలిసి ఉండండి వాళ్లు అలసిపోయినప్పుడు ఒక కప్పు కాఫీ పెట్టి ఇవ్వడం… పనుల్లో ఉన్నప్పుడు చిన్న సహాయం చేయడం ఏదైనా ఇబ్బంది వస్తే తోడుగా ఉండడం వంటివి చేస్తే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది మీ మీద ప్రేమ పెరుగుతుంది.

స్పర్శ ఒక మాయ…

నిజానికి స్పర్శ చాలు మీ జీవిత భాగస్వామి మనసుని మార్చడానికి మీ జీవిత భాగస్వామి ఏ బాధలో ఉన్నా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఒక హగ్, ఒక ముద్దు మెడిసిన్ లాగా పని చేస్తాయి. పైగా అది శారీరకంగా మానసికంగా కూడా వారిలో మార్పు తీసుకువస్తుంది.

ఓ చక్కటి బహుమతి..

వాళ్ళ పుట్టినరోజు నాడు లేదంటే ప్రేమికుల రోజు పెళ్లి రోజు ఇలా ఏదో ఒక సందర్భంలో వారికి నచ్చిన ఒక బహుమతిని ఇవ్వండి ఇది ఖరీదైనదే అక్కర్లేదు ప్రేమను పెంచేందుకు ఒక చిన్న బహుమతి చాలు. ప్రేమ పూర్వకంగా పెట్టే ఒక ముద్ద అయినా సరే వారికి ఇవ్వండి మీరు ఎంత ప్రత్యేకమో వారికి తెలుస్తుంది.

మధుర జ్ఞాపకాన్ని ఇవ్వండి..

మీకు సెలవు రోజు నాడు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చక్కటి ప్రదేశానికి తీసుకువెళ్లండి అవకాశం వచ్చినప్పుడు సరదాగా గడిపేసి మధుర జ్ఞాపకం గా దానిని మార్చుకోండి.

చక్కటి తీయటి మాటలు…

రోజుకు ఒకసారి కూర్చుని చక్కగా మాట్లాడుకోండి. టైం ఉండకపోయినా రాత్రి నిద్ర పోయేముందు ఉదయం లేచిన వెంటనే కానీ ఒక ఐదు నిమిషాలు స్పెషల్ గా మాట్లాడుకోండి ఇది చాలు భాగస్వామిని ప్రేమతో కట్టిపడేయడానికి.

Read more RELATED
Recommended to you

Exit mobile version