ఏకంగా నార్త్ సూపర్ స్టార్ డైరెక్షన్లో వెంకీ మామ.. హిట్ కొడతాడా..?

-

విక్టరీ వెంకటేష్ ఇటీవల ఎక్కువగా మల్టీస్టారర్ మూవీలలో చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. వరుస సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ లో వెళ్తున్న వెంకటేష్ ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలు చేయడం లో ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఓకే చెబుతూ ముందుకు వెళుతున్నాడు. అందుకు ఉదాహరణ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు తో మల్టీస్టారర్ మూవీ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఎఫ్ 2 సినిమాలో కూడా మల్టీస్టారర్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు మళ్లీ అదే మల్టీస్టారర్ కాంబినేషన్తో F3 సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు వెంకటేష్.

ఇక ఇదిలా ఉండగా వెంకటేష్ హిందీలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో మల్టీస్టారర్ మూవీ అయిన కభీ ఈద్ కభీ దివాళి.. ఇక ఈ సినిమాలో వీరిద్దరూ మల్టీస్టారర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వెంకటేష్ కూడా ముంబైకి వెళ్లి మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. అయితే మొదటి షెడ్యూల్ పై అసంతృప్తి వ్యక్త పరిచిన సల్మాన్ ఖాన్ మళ్లీ రీషూట్ చేయాలని పట్టుబట్టాడు అందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పడం జరిగింది. దర్శకుడు మాత్రం రీ షూట్ చేయడానికి ససేమిరా అన్నాడు. కానీ కథకు తగ్గట్లు గానే ఇప్పటివరకు చిత్రీకరణ చేశాం కదా మళ్ళీ మార్చాల్సిన అవసరం ఏముంది.. థియేటర్లలో తప్పకుండా బాగా వస్తుందని డైరెక్టర్ వాదిస్తూ వచ్చాడు.

కానీ సల్మాన్ ఖాన్ వినకపోవడంతో నిర్మాతలు కూడా తమకు సంతృప్తి లేదని రీ షూట్ చేయాల్సిందిగా చెప్పడంతో దర్శకుడు సినిమా నుంచి తప్పుకున్నాడు. గతంలో ఈఈ వార్త బాగా వైరల్ గా మారిగా.. ఇక ఈ సినిమాకు దర్శకుడు లేకుండా పోయాడు. ఇక దీంతో ఆ బాధ్యతలు సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ హిందీలో నటిస్తున్న ఈ సినిమా విషయంలో దర్శకుడు వివాదం రావడం చర్చనీయాంశం అయింది.. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ త్వరలో మళ్లీ షూటింగ్ ప్రారంభించి సినిమాను పూర్తి చేయబోతున్నాడు. అంతే సల్మాన్ డైరెక్షన్ లో వెంకటేష్ చేయబోతున్నాడు.సల్మాన్ ఖాన్ తో నటించడం అంటే చాలా పెద్ద విషయం అలాంటిది ఆయన దర్శకత్వంలోనే వెంకటేష్ కి సినిమా చేసే అవకాశం వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news