2004 లో రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ మూవీ సూపర్ హిట్ అయి ఆ టైమ్ లో మాస్ మహా రాజా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. రవితేజ ,అతని గ్యాంగ్,బ్రహ్మానందం మధ్య వచ్చే ట్రైన్ కామెడీ సీన్స్ ప్రేక్షకులను చాలా అలరించాయి. ఈ చిత్రంలో స్నేహ హీరోయిన్గా నటించింది.ఇదిలా ఉంటే ఈ మూవీ 2023 డిసెంబర్ 30 న రీ రిలీజ్ అయింది.ఈ వారం రిలీజైన స్ట్రెయిట్ చిత్రాలకు వెంకీ సినిమా గట్టి పోటీ ఇస్తోంది.
వెంకీ సినిమా స్ట్రెయిట్ సినిమాలకు మించి వసూళ్లను రాబట్టుతుంది.డిసెంబర్ 30 న రీ రిలీజైన ఈ చిత్రం ఇప్పటి వరకు అంటే రెండు రోజుల్లో దాదాపు కోటి తొంభై లక్షల వరకు వసూళ్ల ను రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు శనివారం ఒక్క రోజే దాదాపు కోటి ముప్పై లక్షల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఆదివారం రోజు అరవై లక్షల కు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఈ వారం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన స్ట్రెయిట్ సినిమా ల్లో కళ్యాణ్ రామ్ డెవిల్ కోటిన్నర వరకు రాబట్టగా, రోషన్ కనకాల బబుల్ గమ్ మూవీకి కోటి లోపే కలెక్షన్స్ వచ్చాయి. ఈ స్ట్రెయిట్ చిత్రాలను వెంకీ రీ రిలీజ్ పూర్తిగా డామినేషన్ చేసినట్లు తెలుస్తుంది.. తెలుగు లో రీ రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో వెంకీ మూవీ ఒకటిగా నిలిచింది.